దృశ్యం 2 సెన్సార్ పూర్తి

మలయాళంలో మోహన్‌లాల్ ప్రధాన పాత్రలో 2013 విడుదలైన థ్రిల్లర్ మూవీ ‘దృశ్యం’. ఈ మూవీ ఏ రేంజ్లో సక్సెస్ సాధించిందో చెప్పాల్సిన పనిలేదు. ఆపదలో చిక్కుకున్న తన కుటుంబాన్ని ఓ మామూలు వ్యక్తి ఎలా కాపాడుకుంటాడూ అనే కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ మూవీ తెలుగుతో పాటు, తమిళ, హిందీ భాషల్లో కూడా రీమేక్ చేయగా.. అన్ని భాషల్లో సూపర్ హిట్ సాధించింది. తెలుగులో ప్రధాన పాత్రలో వెంకటేష్ నటించగా.. ఆయన భార్యగా మీనా నటించారు. రీసెంట్ గా మలయాళంలో ఈ చిత్రానికి సీక్వెల్ పూర్తి చేసి , ఓటిటి లో రిలీజ్ చేసారు. ఇక ఇప్పుడు ఈ సీక్వెల్ ను తెలుగు ప్రేక్షకులకు అందజేయబోతున్నారు.

ఓరిజినల్ దర్శకుడైన జీతు జోసెఫ్ దర్వకత్వంలోనే సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ ‘దృశ్యం 2’ తెలుగు వెర్షన్ ను నిర్మించారు. వెంకటేష్ , మీనా, ఎస్తేర్ అనిల్, కృతికా, నదియా, నరేష్ పాత్రలతో పాటు కొత్తగా సంపత్ నంది కూడా రెండో భాగంలో నటించారు. ఈ సినిమాని కూడా అతి తక్కువ టైమ్ లో చిత్రీకరణ పూర్తి చేశాడు దర్శకుడు జీతు జోసెఫ్. అతి త్వరలో విడుదల కాబోతున్నఈ సినిమాకి ఇటీవల సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. సినిమాకి క్లీన్ యూ సర్టిఫికెట్ ను జారీ చేశారు. కేబుల్ ఆరేటర్ అయిన రాంబాబు.. ఓ థియేటర్ ఓనర్ అయి.. మళ్ళీ పాత కేసు విషయంలో కొత్త సమస్యల్ని ఎదుర్కొని వాటిని తన తెలివితేటలతో ఎలా తిప్పికొడతాడు అన్నదే సీక్వెల్ కథాంశం.