తెలంగాణ పదో తరగతి ఫలితాల విడుదలకు ఎన్నికల సంఘం అనుమతి

results

హైదరాబాద్‌ః రేపు(మంగళవారం) ఉదయం తెలంగాణలో 10వ తరగతి పరీక్షా ఫలితాలు కాబోతున్నాయి. టెన్త్ రిజల్ట్స్ ను రేపు విడుదల చేయడానికి విద్యాశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రేపు ఉదయం 11 గంటలకు పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ఫలితాలను విడుదల చేయనున్నారు. ఫలితాలు ఆన్ లైన్ లో విడుదల కాబోతున్నాయి. పదో తరగతి పరీక్షా ఫలితాలకు విడుదల చేసేందుకు ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పదో తరగతి పరీక్షల ఫలితాలను బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అధికారిక వెబ్ సైట్ https://results.bsetelangana.org లో చెక్ చేసుకోవచ్చు.

కాగా, మార్చి 18 నుంచి ఏప్రిల్ 2 వరకు పదో తరగతి పరీక్షలు జరిగాయి. దాదాపు 5.08 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. వీరిలో 2,50,433 మంది బాలికలు… 2,57,952 మంది బాలురు పరీక్షలకు హాజరయ్యారు. జవాబు పత్రాల మూల్యాంకనం ప్రక్రియ ఏప్రిల్ 13 నాటికి పూర్తయింది.