ప్రారంభమైన గద్దర్ అంతిమ యాత్ర

గద్దర్ అంతిమయాత్ర ప్రారంభమైంది. LB స్టేడియం నుండి అల్వాల్ లో ఉన్న ఆయన ఇంటివద్ద వరకు యాత్ర కొనసాగనుంది. ఈ యాత్ర లో రాజకీయ నేతలు , ఉద్యమకారులు , కళాకారులు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అల్వాల్ లోని ఇంటివద్ద కాసేపు ఉంచిన తర్వాత గద్దర్‌ స్థాపించిన మహాబోధి పాఠశాల ప్రాంగణంలో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరపనున్నారు.

గత కొద్దీ రోజులుగా అనారోగ్యం తో బాధపడుతున్న గద్దర్..ఆదివారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. గద్దర్ మరణ వార్త యావతా ప్రజానీకాన్ని షాక్ కు గురి చేసింది. ఆదివారం సాయంత్రం ఆయన పార్థివదేహాన్ని హైదరాబాద్ లోని LB స్టేడియం కు ప్రజల సందర్శనార్థం తరలించారు. నిన్న సాయంత్రం నుండి గద్దర్ ను కడసారి చూసేందుకు ప్రజలు, రాజకీయ నేతలు , కళాకారులు , ఉద్యమకారులు పోటెత్తారు. గద్దర్ మనమధ్య లేకపోయినా ఆయన పాటలు ఎప్పటికి అలాగే ఉంటాయని ప్రతి ఒక్కరు అన్నారు.