రవితేజ ‘రావణాసుర’ ఫస్ట్ లుక్ విడుదల

మాస్ మహారాజా రవితేజ కొత్త చిత్రం రావణాసుర ఫస్ట్ లుక్ ను దీపావళి కానుకగా రిలీజ్ చేసారు. అభిషేక్ నామా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని సుధీర్ వర్మ డైరెక్ట్ చేస్తుండగా.. శ్రీ‌కాంత్ విస్సా కథ అందిస్తున్నాడు. ఈ లుక్ లో రవితేజ సింహాస‌నం పై కూర్చుని.. రావ‌ణాసురుడిలా.. ప‌ది త‌ల‌లు ప్ర‌తిబింబించేలా కనిపించాడు. క‌థానాయ‌కుడి పాత్ర‌లో నెగిటీవ్ షేడ్స్ ఉంటాయ‌ని టైటిల్ లోనూ, ఫ‌స్ట్ లుక్ లోనూ అర్థ‌మ‌వుతూనే ఉంది.

ఈ చిత్రం తాలూకా న‌టీన‌టులు సాంకేతిక నిపుణుల వివ‌రాలు త్వ‌ర‌లో తెలుస్తాయి. ర‌వితేజ చేతిలో చాలా సినిమాలున్నాయిప్పుడు. ఖిలాడీ రెడీ అయిపోయింది. రామారావు సెట్స్‌పై ఉంది. ధ‌మాకా, టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు సినిమాలు ఒప్పుకున్నాడు. రామారావు షూటింగ్ పూర్త‌యిన వెంట‌నే.. ఈ చిత్రాన్ని సెట్స్‌పైకి తీసుకెళ్తార‌ని స‌మాచారం.