తీన్మార్ మల్లన్న ఘన విజయం..

వరంగల్​-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న విజయం సాధించారు. జూన్‌ 5న ఉదయం 8గంటలకు ప్రారంభమైన ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్‌ శుక్రవారం రాత్రి 10.30 గంటల వరకు కొనసాగింది.

ఈ ఎన్నికలో పోటీచేసిన బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ కుమార్, స్వతంత్ర అభ్యర్థి అశోక్ కుమార్ ప్రాధాన్యత ఓట్లు తక్కువగా రావడంతో ఎలిమినేషన్‌కి గురయ్యారు. తీన్మార్ మల్లన్న విజయం సాధించడంతో కాంగ్రెస్ నేతలు సంబురాలు చేసుకుంటున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డి ఓటమిని అంగీకరించారు. సాంకేతికంగా ఓడిన, నైతికంగా బీఆర్ఎస్ పార్టీ గెలిచినట్లు ఆయన పేర్కొన్నారు.