ఉక్రెయిన్ బాధితులకు బ్రిట‌న్ రాణి క్వీన్ ఎలిజబెత్ విరాళం

న్యూఢిల్లీ : ర‌ష్యా – ఉక్రెయిన్ పై జ‌రుపుతోన్న దాడిపై ఇప్ప‌టికే అమెరికా, బ్రిట‌న్‌, ప‌లు యూర‌ప్ దేశాలు ఆంక్ష‌లు విధించాయి. మ‌రిన్ని ఆంక్ష‌ల దిశ‌గా ముందుకు సాగుతున్నాయి. ఈ యుద్ధం కార‌ణంగా పెద్ద సంఖ్య‌లో ప్ర‌జ‌లు, సైనికులు ప్రాణాలు కోల్పోయార‌ని రిపోర్టులు పేర్కొంటున్నాయి. ర‌ష్యా దాడి కార‌ణంగా ఉక్రెయిన్ రూపురేఖ‌లు పూర్తిగా మారిపోయాయి. ఇప్ప‌టికే అనేక దేశాలు, అంత‌ర్జాతీయ సంస్థ‌లు భారీ ఆర్థిక సాయం ప్ర‌క‌టించాయి.

బ్రిట‌న్ రాణి క్వీన్ ఎలిజ‌బెత్ ఉక్రెయిన్ పౌరుల‌కు అండ‌గా నిలిచారు. భారీ సాయం చేస్తామ‌ని హామీ ఇచ్చారు. ఉక్రెయిన్‌లో తీవ్రమవుతున్న సంక్షోభం మధ్య, బ్రిటిష్ క్వీన్ ఎలిజబెత్ II బాధితులకు మద్దతుగా నిలిచారు. రష్యా సైనిక చర్య వల్ల ప్రభావితమైన పౌరులకు సహాయం చేయమని విపత్తుల అత్యవసర కమిటీ (DEC) ఉక్రెయిన్ విజ్ఞప్తికి విరాళం ఇచ్చారు. “డిజాస్టర్స్ ఎమర్జెన్సీ కమిటీకి మద్దతునిస్తూ మరియు DEC ఉక్రెయిన్ హ్యుమానిటేరియన్ అప్పీల్‌కు ఉదారంగా విరాళం అందించినందుకు హర్ మెజెస్టి ది క్వీన్‌కి చాలా ధన్యవాదాలు” అని సంస్థ తెలిపింది.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/movies/