లాక్‌డౌన్‌ పొడగింపు అంశాన్ని కేంద్రం పరిశీలిస్తోంది

కేంద్ర హోం శాఖ సహయ మంత్రి కిషన్‌ రెడ్డి వెల్లడి

kishan reddy
kishan reddy

దిల్లీ: దేశంలో లాక్‌డౌన్‌ పొడగించాలంటూ రాష్ట్రాలనుండి విజ్ఞప్తులు వస్తున్న నేపథ్యంలో, కేంద్ర హోం శాఖ సహయ మంత్రి కిషన్‌రెడ్డి లాక్‌డౌన్‌ పొడగింపుపై కీలక విషయాలు తెలిపారు. లాక్‌డౌన్‌ పొడగింపు అంశంపై ప్రధాని మోది, మాజీ రాష్ట్రపతులు, ప్రధానులు,వివిధ రాజకీయ పార్టీ నేతలు, మేధావులతో మాట్లాడారు. ప్రపంచంలోని అన్ని దేశాలలో విపత్కర పరిస్థితులు నెలకొనడంతో, లాక్‌డౌన్‌ పొడగింపు పై కేంద్ర ప్రభుత్వం చర్చలు జరుపుతుంది. దీనిపై తొందరలోనే స్పష్టమైన వివరణ ఇస్తామని కిషన్‌ రెడ్డి తెలిపారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telangana/