కేరళ పర్యటనలో తెలంగాణ ఉన్నతాధికారుల బృందం

Team of Telangana dignitaries
Team of Telangana dignitaries

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో సమగ్ర ఎన్నారై విధానాన్ని రూపొందించే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. సిఎం కెసిఆర్‌ ఆదేశాల మేరకు ఇందుకు సంబంధించి వివిధ రాష్ట్రాల విధానాలను తెలంగాణ రాష్ట్ర ఉన్నతాధికారుల బృందం అధ్యయనం చేస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్ర ఉన్నతాధికారుల బృందం కేరళ రాష్ట్రంలో పర్యటిస్తోంది. విదేశాలకు వెళ్లే కేరళ ప్రజలకు ఆ రాష్ట్రం అమలు చేస్తున్న విధానంపై ఈ బృందం అధ్యయనం చేస్తోంది. తెలంగాణ ఉన్నతాధికారుల బృందంలో ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌, సిఎం ముఖ్యకార్యదర్శి నర్సింగరావు లు ఉన్నారు. తిరువనంతపురంలో ప్రవాస కేరళీయుల సంక్షేమ వ్యవహారాల శాఖ అధికారులతో వారు సమావేశమయ్యారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/