టెస్టు ర్యాంకింగ్స్‌లో టీం ఇండియా అగ్రస్థానం

121 పాయింట్లతో నంబర్‌వన్‌ స్థానం పదిలం

Team India tops Test rankings
Team India tops Test rankings

ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో టీం ఇండియా మరో సారి అగ్రస్థానం లో నిలిచింది. యాన్యువల్ అప్‌డేట్‌ ప్రకారం టెస్టు ర్యాంకింగ్స్‌లో టీమ్‌ఇండియా నంబర్‌వన్‌ గా ఉంది. 121 పాయింట్లతో తన ర్యాంకును నిలబెట్టుకుంది. కాగా న్యూజిలాండ్‌ 120 పాయింట్లతో 2 స్థానంలో ఉంది. ఈ రెండు జట్ల మధ్య మధ్య ఒక్క పాయింట్‌ మాత్రమే తేడా ఉండటం గమనార్హం. ఇదిలా ఉండగా వచ్చే జూన్‌లో ఇంగ్లాండ్‌ వేదికగా ప్రపంచటెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్లో భారత్‌, న్యూజిలాండ్‌ తలపడనున్నాయి.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/