MLC అనంతబాబుని తరిమికొట్టారు : TDP ట్వీట్

వైసీసీ సస్పెండ్ చేసిన ఎమ్మెల్సీ అనంతబాబును దళితులు తరిమికొట్టారని టీడీపీ ట్వీట్ చేసింది. ‘జగన్ ప్రియ శిష్యుడు, దళితులను చంపి డోర్ డెలివరీ చేసే గంజాయి డాన్ను తరిమికొట్టారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడులో అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేయడానికి ప్రయత్నించిన వైసీపీ డాన్ను ఊరి బయటకు తరమడంతో అక్కడి నుంచి పారిపోయాడు. జగన్ గుర్తుంచుకో. నీ పతనం చూసేది ఈ దళితులే’ అని టీడీపీ ఓ వీడియోను పోస్ట్ చేసింది.