బ్రిటన్ మహారాణి ఎలిజబెత్ కు కరోనా పాజిటివ్

బ్రిటన్ : బ్రిటన్ మహారాణి ఎలిజబెత్ కరోనా బారిన పడ్డారు. ఆమె కరోనా స్వల్ప లక్షణాలతో కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధారింపబడినట్లు బంకింగ్‌హోం ప్యాలెస్ ఆదివారం ప్రకటించింది. 95 ఏండ్ల క్వీన్ ఎలిజబెత్ ప్రస్తుతం తన విండ్సర్ కాజిల్‌లో నివాసం ఉంటున్నారు. వైద్యుల పర్యవేక్షణలో ఆమెకు వైద్యం కొనసాగుతోందని తెలిపింది. కొవిడ్ నుంచి కోలుకునేందుకు తీసుకోవాల్సిన ప్రోటోకాల్స్‌ను పాటిస్తున్నట్లు బంకింగ్‌హోం ప్యాలెస్ వెల్లడించింది. ఎవరికైనా కరోనా సోకితే 10 రోజుల పాటు హోం క్వారంటైన్‌లో ఉండాలని ఇటీవలే ఇంగ్లండ్ ప్రకటించింది. ఈ నెల మొదట్లో ఎలిజబెత్ కుమారుడు ప్రిన్స్ చార్లెస్, ఆయన భార్య కామిల్లా కూడా కరోనా బారిన పడ్డ విషయం తెలిసిందే.
క్వీన్ ఎలిజబెత్ తొలిసారిగా 2021, జనవరిలో కొవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నారు. అనంతరం రెండో డోసు వ్యాక్సిన్ తీసుకున్నారు. ఇటీవల బూస్టర్ డోసు కూడా తీసుకున్నట్లు బంకింగ్‌హోం ప్యాలెస్ తెలిపింది. అయినప్పటికీ మరోసారి ఆమె కొవిడ్ బారిన పడ్డారు.
తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/business/