ఫిబ్రవరి 13న తెలంగాణలో పర్యటించనున్న ప్రధాని మోడీ

న్యూఢిల్లీః తెలంగాణలో ప్రధాని మోడీ పర్యటన ఖరారైంది. ఫిబ్రవరి 13న రాష్ట్రానికి మోడీ రానున్నారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ఆధునీకరణ పనులతో పాటు రాష్ట్రంలో పలు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. అనంతరం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో తెలంగాణ బిజెపి నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో పాల్గొని మాట్లాడనున్నారు.
కాగా, వాస్తవానికి సికింద్రాబాద్-విశాఖ వందేభారత్ ట్రయిన్ ను ప్రారంభించడానికి ఈ నెల 19నే మోడీ తెలంగాణలో పర్యటించాల్సింది. కానీ అనివార్య కారణాలవల్ల టూర్ క్యాన్సిల్ అయ్యింది. దీంతో అనుకున్న టైం కంటే ముందే ఈ నెల 15న సికింద్రాబాద్- వైజాగ్ వందేభారత్ ట్రయిన్ ను మోడీ వర్చువల్ గా ప్రారంభించారు. దీంతో ఇపుడు మోడీ టూర్ ఖరారయ్యింది.
మరోవైపు ఈనెల 28న రాష్ట్రంలో జరగాల్సిన కేంద్ర మంత్రి అమిత్‌షా పర్యటన పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో వాయిదా పడింది.
తాజా ఏపి వార్తల కోసం క్లిక్ చేయండిః https://www.vaartha.com/category/andhra-pradesh/