అనంతపురం జిల్లాలో టీడీపీ సీనియర్ నేత కన్నుమూత

అనంతపురం టీడీపీ పార్టీ లో విషాదం నెలకొంది. జిల్లా పరిషత్ మాజీ చైర్మన్, టీడీపీ సీనియర్ నేత కేసీ నారాయణ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. శుక్రవారం ఉదయం గుంతకల్లులోని స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. కేసీ నారాయణ మృతి పట్ల అధినేత చంద్రబాబు, నేతలు, కార్యకర్తలు సంతాపం తెలిపారు.

అనంతపురం జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కె. సి నారాయణ మృతి భాదాకరమన్నారు చంద్రబాబు. నారాయణ పార్టీకి అందించిన సేవలు అనిర్వచనీయమని.. జిల్లా పరిషత్ చైర్మన్ గా ఉమ్మడి అనంతపురం జిల్లా అభివృద్ధికి ఎనలేని కృషి చేశారన్నారు. ఆయన మృతి పార్టీకి తీరని లోటు.. కుటుంబ సభ్యులకు ప్రగాడ సానూభూతి తెలుపుతూ.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడ్ని ప్రార్ధిస్తున్నాను అంటూ సంతాపాన్ని తెలియజేశారు.