గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన బోరిస్​ జాన్సన్​

న్యూఢిల్లీ: నేడు దేశవ్యాప్తంగా 73వ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్న సందర్భంగా యూకే ప్రధాని బోరిస్ జాన్సన్ శుభాకాంక్షలు తెలిపారు. “UK , భారతదేశం దశాబ్దాలుగా.. తరతరాలుగా, మేము ఎదుర్కొన్న కొన్ని సవాళ్లు.. మాకు ఉన్న ప్రత్యేకమైన బంధాలతో ముడిపడి ఉన్నాయి’’ అని బోరిస్​ జాన్సన్ ఒక ట్వీట్‌లో తెలిపారు.

గణతంత్ర దినోత్సవం సందర్భంగా భారతదేశ ప్రజలకు, బ్రిటిష్ భారతీయులందరికీ శుభాకాంక్షలను తెలియజేస్తున్నా అని బ్రిటన్​ ప్రధాని బోరిస్​ తెలిపారు. భారతదేశం ఈ రోజు 73వ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటోందని, దాని సైనిక పరాక్రమాన్ని, సాంస్కృతిక ప్రదర్శనను ఢిల్లీలోని రాజ్‌పథ్‌లో నిర్వహిస్తోందని బోరిస్​ పేర్కొన్నారు.

తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/business/