చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ 6వ రోజు రిలే నిరాహార దీక్షలు

దీక్షల్లో వినాయకుని విగ్రహాల ప్రతిష్టాపన. రాష్ట్రానికి జగన్ రెడ్డి అనే విఘ్నం నుండి విముక్తి ప్రసాదించాలని, చంద్రబాబు త్వరగా బయటకు రావాలని కోరుతూ టీడీపీ నాయకుల పూజలు

Ganesha impersonator signing the program ‘Nenusaitham Babu kosam’.

అమరావతి -ప్రభాతవార్త ప్రతినిధి: టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నాయకులు ఆరో రోజు రిలే నిరాహార దీక్షలను చేపట్టారు. దీక్ష శిబిరాలలో వినాయకుని విగ్రహాలను ప్రతిష్టాపించి పూజలు నిర్వహించారు. వైసీపీ అడ్డంకులను తొలగించుకొని చంద్రబాబు నాయుడు త్వరగా విడుదల కావాలని టీడీపీ నాయకులు వినాయకుడిని పూజలు చేశారు. రాష్ట్రానికి జగన్ రెడ్డి అనే విఘ్నం నుండి విముక్తి ప్రసాదించాలని, చంద్రబాబు నాయుడు త్వరగా బయటకు రావాలని వేడుకోన్నారు. శ్రీకాకుళంలో అరసవల్లి దేవస్థానం, విజయనగరంలో పైడితల్లి అమ్మవారి ఆలయం, విశాఖపట్నంలో సింహాచలం టెంపుల్, తూర్పుగోదావరిలో అన్నవారం టెంపుల్, పశ్చిమగోదావరి జిల్లాలో ద్వారకతిరుమల, కృష్ణా జిల్లాలో కనకదుర్గమ్మ టెంపుల్‌కు ఆయా జిల్లాల నాయకులు పాదయాత్రలు నిర్వహించి పూజలు నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ బాబుతో నేను కరపత్రాలను విస్తృతంగా పంపిణీ చేశారు.

TDP initiators who presented petition to Ganesha

ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మాట్లాడుతూ టీడీపీ హయాంలో యువతకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు స్కిల్‌ డెవలప్మెంట్‌ ద్వారా ఎంతో మంది యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చారన్నారు. ఒక్క రూపాయి కూడా అవినీతి జరుగలేదని ఆ కంపెనీ యజమానులే చెప్తున్నా కూడా చంద్రబాబును కావాలని కక్ష్యతో, తప్పుడు కేసులతో వైసీపీ ప్రభుత్వం అరెస్టు చేసిందన్నారు. ఎంతో మంది యువత స్కిల్‌ డెవలప్ మెంట్ ద్వారా ఉద్యోగాలు పొంది లక్షల రూపాయల వేతనాలతో ఆనందంగా జీవితాలు గడుపుతున్నారన్నది కూడా రుజువు అయిందని పేర్కొన్నారు. ఎటువంటి అవినీతికి తావు లేకుండా, ఒక్క కేసులో కూడా ముద్దయి కాకుండా నిప్పులాంటి మనిషిగా బ్రతికిన మహోన్నతమైన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు ను జైలుకు పంపి కక్ష సాధించడం వైసీపీ నీచ రాజకీయానికి పరాకాష్ట ఆయన మండిపడ్డారు.

Guntur East TDP in-charge Mohammad Nazir speaking at the initiation in Guntur on Monday

రాష్ట్రంలో అరాచక, అణచివేత ప్రభుత్వానికి ప్రజలు చరమగీతం పాడడం ఖాయమని హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో పోలిట్ బ్యూరో సభ్యులు అశోక్ గజపతి రాజు,సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, నక్కా ఆనంద్ బాబు, ఎండీ షరీఫ్, రెడ్డెప్పగారి శ్రీనివాస రెడ్డి, కొల్లు రవీంద్ర , గుమ్మడి సంధ్య రాణి, పార్లమెంట్ అధ్యక్షులు మల్లెల లింగా రెడ్డి, పులివర్తి నాని, జీవి ఆంజనేయులు, శ్రావణ్ కుమార్, గన్ని వీరాంజనేయులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు, రాష్ట్ర, మండల నాయకులు, క్లస్టర్, యూనిట్, బూత్ స్థాయి నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు.

ఫోటో గ్యాలరీ కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/category/photo-gallery/