వైఎస్‌ఆర్‌సిపిపై హైకోర్టులో పిటిషన్లు దాఖలు

తగిన ఆధారాలను న్యాయస్థానానికి సమర్పిస్తాం..టిడిపి ఎమ్మెల్సీ అశోక్​ బాబు

Andhra Pradesh High Court
Andhra Pradesh High Court

అమరాతి: టిడిపి ఎమ్మెల్సీ అశోక్‌ బాబు వైఎస్‌ఆర్‌సిపి అరాచకాలపై ఏపి హైకోర్టులో మూడు పిల్స్‌ దాఖలు చేశామని తెలిపారు. 12 జెడ్పీటీసీ, దాదాపు 470 ఎంపీటీసీల్లో ఎన్నికల రీ షెడ్యూల్ కోరామని, రీషెడ్యూల్ కోరుతూ తగిన ఆధారాలను న్యాయస్థానానికి సమర్పిస్తామని చెప్పారు. తమ అభ్యర్థులు నామినేషన్లు వేయకుండా అవరోధాలు కల్పించారని, నామినేషన్ల పరిశీలనా సమయంలోనూ పత్రాలు చించేసే దుస్థితి నెలకొందని ఆరోపించారు. నిన్న మాచర్లలో టిడిపి నాయకులపై దాడి ఘటన గురించి ఆయన ప్రస్తావిస్తూ, తమ నాయకులు పోలీసులకు సమాచారం ఇవ్వకుండా వెళ్లారని హోం శాఖ మంత్రి సుచరిత చెబుతున్నారని ఆ మాట వాస్తవం కాదని అన్నారు. పోలీసులకు తాము ముందస్తు సమాచారం ఇవ్వడం వల్లే ఆ సమాచారం వైఎస్‌ఆర్‌సిపికి చేరిందని ఆరోపించారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/