కరోనా..ఖమ్మం యువకుడికి వైరస్‌ లక్షణాలు

Coronavirus in Khammam
Coronavirus in Khammam

ఖమ్మం: పట్టణానికి చెందిన ఓ యువకుడికి కరోనా లక్షణాలు బయటపడడంతో వైద్యులు అప్రమత్తమయ్యారు. అమెరికా డెట్రాయిట్‌లో డాక్టర్‌గా పని చేస్తున్న సదరు యువకుడు ఈ నెల 7న అమెరికా నుంచి హైదరాబాద్‌కు.. అక్కడి నుంచి ఖమ్మం వచ్చాడు. ఐదు రోజులుగా జలుబు, జ్వరం, దగ్గుతో యువకుడు బాధపడుతున్నాడు. ప్రస్తుతం అతనికి ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలోని ఐసోలేషన్‌ వార్డులో వైద్యులు చికిత్సనందిస్తున్నారు. శాంపిల్స్‌ను పుణెకు పంపారు. బాధితుడు ఖమ్మంలోని శ్రీరామ్‌ హిల్స్‌ కాలనీకి చెందిన వాడిగా గుర్తించారు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/