డీజీపీకి టీడీపీ నేత వర్ల రామయ్య లేఖ

వీఐపీ సౌకర్యాలు కల్పిస్తున్న జైలు అధికారులపై చర్యలు తీసుకోవాలి
జైల్లో అనంతబాబుకు ప్రత్యేక గదిని కేటాయించడం నిజమా? కాదా?

అమరావతి : డ్రైవర్ ను హత్య చేసిన కేసులో నిందితుడిగా ఉన్న వైస్సార్సీపీ ఎమ్మెల్యే అనంతబాబుకు జైల్లో సకల సౌకర్యాలు లభిస్తున్నాయని డీజీపీకి టీడీపీ నేత వర్ల రామయ్య లేఖ రాశారు. అనంతబాబుకు వీఐపీ సౌకర్యాలు కల్పిస్తున్న జైలు అధికారులపై చర్యలు తీసుకోవాలని లేఖలో కోరారు. అనంతబాబుకు పెద్ద నేర చరిత్ర ఉందని చెప్పారు. నేర చరిత్ర ఉన్న అనంతబాబుకు జైల్లో అన్ని సదుపాయాలు కల్పిస్తున్నారని తెలియడం బాధాకరంగా ఉందని అన్నారు. జైల్లో ఆయనకు ప్రత్యేక గదిని కేటాయించడం నిజమా? కాదా? అని ఆయన ప్రశ్నించారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/international-news/