తెలంగాణ ప్రజలందరికీ శుభాకాంక్షలు

అమరవీరుల స్మృతికి నివాళులర్పిస్తున్నాను

nara lokesh
nara lokesh

అమరావతి: టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ తెలంగాణ రాష్ట్రావతరణ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. తెలంగాణ ప్రజల త్యాగాలను ఆయన కొనియాడారు. ‘తెలంగాణ ఆవిర్భావ సంబురాలను ఘనంగా జరుపుకుంటున్న తెలంగాణ ప్రజలందరికీ హార్ధిక శుభాకాంక్షలు. ఎందరో అమరవీరుల త్యాగాల ప్రతిఫలం తెలంగాణ రాష్ట్రం. రాష్ట్రావతరణ దినం సందర్భంగా ఆ అమరవీరుల స్మృతికి నివాళులర్పిస్తున్నాను’ అని లోకేశ్ చెప్పారు


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/