హీరో నిఖిల్ ను అడ్డుకున్న సిటీ పోలీసులు

ఈ-పాస్ లేదని నిరాకరణ

Actor Nikhil
Actor Nikhil

Hyderabad: కోవిడ్‌ బాధితుడికి మందులు అందించేందుకు హీరో నిఖిల్‌ ఆసుపత్రికి వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ నిఖిల్‌ ట్వీట్‌ చేశాడు. కరోనా బాధపడుతున్న ఓ వ్యక్తికి మందులు ఇచ్చేందుకు ఉప్పల్‌ నుంచి కిమ్స్‌ మినిస్టర్స్‌ రోడ్డులో ప్రయాణిస్తున్న సమయంలో పోలీసులు తన కారుని ఆపారని తెలిపాలు. బాధితుడి వివరాలు, వైద్యుడి రాసిన మందుల చీటి చూపించినా పోలీసులు అనుమతించలేదని, ఈ-పాస్‌ ఉండాల్సిందే అని స్పష్టం చేశారని తెలిపాడు. సర్వర్లు డౌన్‌ కావడం వల్ల ఈ పాస్ దొరకలేదని వివరించాడు. దాంతో మెడికల్‌ ఎమర్జెన్సీ అని చెబితే అనుమతి ఇస్తారని భావించి, . రోడ్డు పైకి వచ్చినట్లు ట్వీట్‌లో పేర్కొన్నాడు. దీంతో ఆయన ట్వీట్‌పై స్పందించిన హైదరాబాద్‌ సిటీ పోలీస్‌ విభాగం.. ‘‘డియర్‌ సర్‌, మీ లొకేషన్‌ ఒక్కసారి మాకు పంపించండి. స్థానిక అధికారులతో మాట్లాడి మీ సమస్యను తీరుస్తాం’’.. అంటూ రిప్లై ఇచ్చింది.

తాజా ఎన్నారై వార్తల కోసం : https://www.vaartha.com/news/nri/