రేవంత్ కు అడ్డు లేకుండా చేసిన షర్మిల

వైస్ షర్మిల…టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కి అడ్డు తొలగించింది. త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు YSRTP పార్టీ దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. అలాగే తమ పూర్తి మద్దతు కాంగ్రెస్ పార్టీకే అని షర్మిల ప్రకటించారు. అయితే కామారెడ్డి లో YSRTP పార్టీ జిల్లా పార్టీ అధ్యక్షుడు నీలం సుధాకర్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తానంటూ నామినేషన్ వేయడానికి సిద్ధమయ్యారు. ఈ క్రమంలో షర్మిల రంగంలోకి దిగింది.

కామారెడ్డిలో రేవంత్ పోటీ చేస్తుండటంతో.. సుధాకర్ పోటీ విషయం తెలుసుకున్న వైఎస్ షర్మిల నేరుగా రంగంలోకి దిగారు. నీలం సుధాకర్‌ను హైదరాబాద్‌కు పిలిపించుకుని మాట్లాడారు షర్మిల. పోటీ నుంచి విరమించుకోవాలని సుధాకర్‌కు సూచించారు షర్మిల. తదుపరి ఎన్నికల్లో మంచి అవకాశం ఉంటుందని భరోసా ఇచ్చారు. దాంతో నీలం సుధాకర్ పోటీ నుంచి తప్పుకునేందుకు అంగీకరించారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు సుధాకర్. ‘పార్టీ అధినేత వైఎస్ షర్మిల ఆదేశాల మేరకు పోటీ నుంచి తప్పుకుంటున్నాను. కాంగ్రెస్ పార్టీతో కలిసి పని చేస్తాను. కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్ రెడ్డిని గెలిపించేందుకు కృషి చేస్తాను.’ అని ప్రకటించారు నీలం సుధాకర్.