త్వరలోనే ముఖ్యమంత్రి జగన్‌కు జ్ఞానోదయం

ఎవరి డిమాండ్‌పై మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నారు

chintamaneni prabhakar
chintamaneni prabhakar

అమరావతి: ముఖ్యమంత్రి జగన్‌కు జ్ఞానోదయం అయ్యే రోజు దగ్గర్లోనే ఉందని టిడిపి నేత మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ అన్నారు. అమరావతి ప్రాంతంలోని వెలగపూడి, తుళ్లూరు, మందడం రైతులు చేస్తున్న దీక్షలకు చింతమనేనితో పాటు దెందులూరు నుంచి తరలివచ్చిన రైతులు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా చింతమనేని మాట్లాడుతూ..ఎవరి డిమాండ్‌పై మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నారో ముఖ్యమంత్రి జగన్‌ చెప్పాలని చింతమనేని డిమాండ్‌ చేశారు. వైఎస్‌ఆర్‌సిపి పాలనలో రాజధాని రైతులు మాత్రమే కన్నీరు పెట్టడం లేదని..రాష్ట్రంలోని కూలీల నుంచి ధనికుల వరకు అందరూ బాధపడుతున్నారన్నారు. చంద్రబాబును ఎక్కడికక్కడ అవమానపరిస్తే రాజధానిని సులభంగా మార్చవచ్చని జగన్‌ భావిస్తున్నారని చింతమనేని ఆరోపించారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telangana/