ఒంగోలు టీడీపీ ఎంపీ అభ్యర్థిగా శ్రీనివాసులు రెడ్డి..

ఒంగోలు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థిగా మాగుంట శ్రీనివాసులు రెడ్డినే బరిలోకి దింపాలని ఆ పార్టీ నిర్ణయించినట్లు తెలుస్తోంది. తొలుత ఈ స్థానానికి శ్రీనివాసులు రెడ్డితో పాటు ఆయన కుమారుడు రాఘవరెడ్డి అభ్యర్థిత్వాన్ని కూడా టీడీపీ పరిశీలించింది. అయితే తన తండ్రే పోటీ చేస్తారని రాఘవరెడ్డి నిన్న ప్రకటించారు. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు తీవ్రత పెరగడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది.

గెలుపేలక్ష్యంగా అసెంబ్లీ, లోక్ సభ సీట్లను ప్రకటించిన టీడీపీ అవసరమైతే మార్పులు చేర్పులకు కూడా వెనుకాడటం లేదు. ఈ నేపథ్యంలో ఇటీవల ప్రకటించిన ఒంగోలు పార్లమెంట్ అభ్యర్ధిని మార్చినట్టుగా తెలుస్తోంది. ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా మాగుంట శ్రీనివాసులురెడ్డి తనయుడు మాగుంట రాఘవరెడ్డిని టీడీపీ అధిష్ఠానం ఇటీవల ప్రకటించింది. అయితే రాఘవరెడ్డి కంటే… అతని తండ్రి, సీనియర్ నేత శ్రీనివాసులు రెడ్డి అయితే బాగుంటుందని భావించిన టీడీపీ అధిష్టానం… పార్టీ అభ్యర్ధుని మారుస్తూ నిర్ణయం తీసుకుంది. దీనితో ఒంగోలు పార్లమెంట్ స్థానం నుంచి మాగుంట శ్రీనివాసులు రెడ్డి పోటీ చేయడం ఖాయమైంది.