ఏపీలోని పరిస్థితులఫై కేటీఆర్ కామెంట్స్ ను షేర్ చేసిన నారా లోకేష్

KTR comments ap power cuts

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సరిగా రోడ్లు లేవని , కరెంట్ లేదని ..నీళ్లు కూడా లేవని తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ అన్నారు. మాదాపూర్‌ హైటెక్స్‌లో జరుగుతున్న క్రెడాయ్‌ ప్రాపర్టీ షోను మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో నిర్మాణ రంగానికి ఎలాంటి ఢోకాలేదన్నారు. మరో 10 నుంచి 15 ఏండ్లు హైదరాబాద్‌కు ఢోకాలేదని స్పష్టం చేశారు.

అలాగే ఏపీలో కరెంటు, నీళ్లు ఇతర వసతులు లేవని ఈ సందర్భాంగా కేటీఆర్ అన్నారు. కొద్ది రోజుల క్రితం తన మిత్రుడు పండగకు ఏపీ వెళ్లివచ్చారు. వచ్చిన తర్వాత నాకు ఫోన్ చేశారు…నాలుగు రోజులు ఉన్నాను….అక్కడ కరెంట్ లేదు,నీళ్లు లేవు,రోడ్లు సరిగ్గా లేవని చెప్పారని కేటీఆర్ వెల్లడించారు. తెలంగాణలోని వాళ్ళను నాలుగు రోజులు బస్సుల్లో ఏపీకి పంపండి…తెలంగాణ సర్కార్ ఏమి చేస్తుందో విలువ తెలుస్తుందని అన్నారని కేటీఆర్ గుర్తు చేశారు. నేను చెప్పడం కాదు…మీరు కూడా ఒక సారి ఏపీ వెళ్లి చూసి రండన్నారన్నారు. కేటీఆర్ అన్న వ్యాఖ్యల వీడియో ను నారా లోకేష్ షేర్ చేసి.. జగన్‌ మోహన్‌ రెడ్డి సెటైర్‌ వేశారు. కేటీఆర్ నోట…జగన్ విధ్వంస పాలన మాట అని.. అట్టుంటది ఒక్క చాన్స్ తోని.. అంటూ లోకేష్‌ సెటైర్‌ వేశారు.

కేటీఆర్ నోట…జగన్ విధ్వంసపాలన మాట..

అట్టుంటది ఒక్క చాన్స్ తోని.. pic.twitter.com/qWKF5ADJLj— Lokesh Nara (@naralokesh) April 29, 2022