ఎన్‌సీఎల్‌ఏటీ తీర్పుపై సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలు

tata sons
tata sons

ముంబయి: కార్పొరేట్‌ దిగ్గజం టాటాసన్స్‌ నేడు ఎన్‌సీఎల్‌ఏటీ తీర్పుపై సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. డిసెంబర్‌ 18 సైరస్‌ మిస్త్రీకి అనుకూలంగా ఎన్‌సీఎల్‌ఏటీ తీర్పును వెలువరించింది. టాటాసన్స్‌ ఎగ్జిక్యూటీవ్‌ ఛైర్మన్‌గా, టీసీఎస్‌, టాటా ఇండస్ట్రీస్‌, టాటా టెలిసర్వీస్‌లకు డైరెక్టర్‌గా నియమించాలని తీర్పులో పేర్కొంది. ఈ తీర్పును సవాలు చేస్తూ టాటా సన్స్‌ ఇవాళ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్‌పై జనవరి 6న న్యాయస్థానం విచారణ జరిపే అవకాశం ఉంది. టీసీఎస్‌ బోర్డుమీటింగ్‌ జనవరి 9న జరగనుండటంతో సత్వర ఉపశమనం కల్పించాలని కోరుతూ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఎన్‌సీఎల్‌ఏటీ తీర్పుతో దాదాపు మూడేళ్ల తర్వాత మిస్త్రీ మళ్లీ ఆ పదవిని చేపట్టే అవకాశం ఉంది. ప్రస్తుతం ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌గా నటరాజన్‌ చంద్రశేఖరన్‌ నియామకాన్ని ఎన్‌క్లాట్‌ నిలుపుదల చేసింది. ఎన్‌.చంద్రశేఖరన్‌ నియామకం చట్ట విరుద్ధమని న్యాయస్థానం పేర్కొంది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/