అయిదో రోజూ అదే తీరు

భారీగా పెరుగుతున్న ‘పెట్రో’ ధరలు

Petrol
Petrol

ముంబై : వాహనదారులకు షాక్‌ ఇచ్చేలా అయిదు రోజులుగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు భారీగా పెరుగుతూ వస్తున్నాయి.

గురువారం హైదరాబాద్‌లో లీటరు పెట్రోల్‌పై రూ.62 పైసలు పెరిగి రూ.76.82, డీజిల్‌ లీటరుపై రూ.59పైసలు పెరిగి రూ.70.59కి చేరింది.

మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు తగ్గుముఖం పట్టాయి.

అమరావతిలో పెట్రోల్‌ ధర లీటరుపై రూ.60పైసలు పెరిగి రూ.77.36కు చేరగా, డీజిల్‌ లీటరుపై రూ.56పైసలు పెరిగి రూ.71.18కి చేరింది.

విజయవాడలో లీటరు పెట్రోల్‌ధర రూ.60పైసలు పెరిగి రూ.76.97కి చేరగా, డీజిల్‌ ధర రూ.57 పైసలు పెరిగి రూ.70.82కుచేరింది.

దేశ రాజధాని ఢిల్లీలో లీటరు పెట్రోల్‌పై రూ.60 పైసలు పెరిగి రూ.74.00కి చేరగా, డీజిల్‌ ధర రూ.60పైసలు పెరిగి రూ.72.22కు చేరింది.

అదేవిధంగా ముంబైలో కూడా పరిస్థితి ఇలానే ఉంది. పెట్రోల్‌ ధరపై రూ.58పైసలు పెరిగి రూ.80.98కి చేరగా, డీజిల్‌ ధర రూ.57పైసలు పెరిగి రూ.70.92కు చేరింది.

అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు తగ్గాయి. బ్రెంట్‌ క్రూడాయిల్‌ ధర బ్యారెల్‌కు 0.75శాతం తగ్గి 40.91డాలర్లకు పడిపోయింది. ఇక డబ్ల్యూటిఐ క్రూడాయిల్‌ ధర బ్యారెల్‌కు 2.22 శాతం తగ్గి 38.70డాలర్లకు దిగివచ్చింది.

తాజా కెరీర్‌ సమాచారం కోసం : https://www.vaartha.com/specials/career/