రతన్‌టాటా పాదాలను తాకిన నారయణమూర్తి

హృదయాన్ని హత్తుకునే మానవత్వం..ఇదో చారిత్రక క్షణం

Narayana Murthy touching Ratan Tata's feet '
Narayana Murthy touching Ratan Tata’s feet ‘

ముంబయి: ఇన్ఫోసిస్‌ సహ వ్యవస్థాపకుడు నారయణ మూర్తి, ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్‌ టాటా మధ్య ఆసక్తికర సందర్భం చోటుచేసుకుంది. టైకాన్‌ 11వ వార్షిక అవార్డుల కార్యక్రమం మంగళవారం రాత్రి ముంబయిలో అట్టహాసంగా జరిగింది. ఈ సందర్భంగా రతన్‌ టాటాను జీవనకాల సాఫల్య పురస్కారంతో సత్కరించారు. నారయణ మూర్తి చేతుల మీదుగా టాటా ఈ అవార్డును అందుకున్నారు. అవార్డును ప్రదానం చేసిన తర్వాత నారాయణ మూర్తి..టాటా పాదాలను మొక్కారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను టైకాన్‌ తన ట్విట్టర్‌ ఖాతాలో పోస్టు చేసింది. హృదయాన్ని హత్తుకునే మానవత్వం..ఇదో చారిత్ర క్షణం అని కొనియాడింది. అటు రతన్‌ టాటా కూడా తన ఇన్‌స్ట్రాగ్రామ్‌ స్టోరీస్‌లో ఈ ఫోటోలను పోస్టు చేశారు. గొప్ప స్నేహితుడైన నారాయణమూర్తి నుంచి అవార్డు అందుకోవడం గర్వంగా ఉందని టాటా సంతోషం వ్యక్తం చేశారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/