ప్రజావాక్కు

Voice-ot-the-people
Voice-ot-the-people


కీర్తి వెలుగులు నింపిన తెలుగు బిడ్డలు
ఇద్దరు తెలుగు బిడ్డలు రెండ్రోజుల వ్యవధిలో ప్రపంచ రికార్డు ల స్థాపన ద్వారా దేశానికి గర్వకారణంగా నిలిచారు. ఇద్దరి విజయాలూ అసామాన్యమైనవి.అతిపిన్న వయసులోనే చదరం గంలో గ్రాండ్‌ మాస్టర్‌ అయిన కోనేరు హంపి ఈసారి ర్యాపిడ్‌ చదరంగంలో విశ్వవిజేతగా నిలిచారు.చిన్నప్పటి నుండి వివిధ స్థాయిలో విజయాల్ని నమోదుచేస్తూ వస్తున్నా, ఈసారి తాను సాధించిన విజయం అపూర్వమైనది. భారత్‌ నుండి కేవలం ఒక్క విశ్వనాథన్‌ ఆనంద్‌ మాత్రమే ముందీ విజయాన్ని అందు కొన్నారు. ప్రపంచర్యాపిడ్‌ చెస్‌కిరీటాన్ని అందుకున్న తొలి భారత మహిళగా చరిత్రసృష్టించారు.ఇక మరో స్ఫూర్తిదాయక విజయం పూర్ణది. 13ఏళ్ల అతిపిన్న వయసులో ఎవరెస్టు శిఖ రంఅధిరోహించిన ఆమెవరసగా ఆరవశిఖరాన్ని పాదా క్రాంతం చేసుకున్నారు. దాన్ని అధిరో హించడం ద్వారా ఈ విజయం సాధించిన ప్రపంచ తొలి ఆదివాసీ మహిళగా చరిత్రకెక్కారు.

  • డా.డి.వి.జి.శంకరరావ్ఞ, పార్వతీపురం
    పెరుగుతున్న నాటుసారా తయారీ

మద్యపాన నిషేధం అమలుచేస్తానన్న జగన్‌ప్రభుత్వం మద్యం షాపులు తగ్గించడం,బార్లు కుదించడం, మద్యం ధరలు పెంచ డం, మద్యం కావాలనుకునే వారికి ఐదు వేల రూపాయలతో కార్డు తీసుకోవడం వంటివి చూడటానికి, వినడానికి బాగానే ఉన్నా క్షేత్రస్థాయిలో నాటుసారా క్రమంగా పెరిగి పల్లె ప్రాం తాల ప్రజలు మద్యంరక్కసికి బలయ్యే ప్రమాదం పొంచి ఉంది. ప్రస్తుతం పెంచిన ధరలు కూలీనాలీ చేసుకునే వారికి అందుబాటులో లేక, మద్యం మానలేక తక్కువ ధరకు లభించే మద్యం కల్తీ, నాటుసారా, గుడుంబా, ఇతర మార్గాల వైపు చూస్తున్నారు. గిరిజన, అటవీ, మారుమూల ప్రాంతాల్లో కుటుంబ పరిశ్రమగా తయారై నాటుసార తయారీ, విక్రయం జోరందుకుంది. ప్రాణాలపై ప్రభావం చూపే దుస్థితితో ఎన్నో కుటుంబాలు నడిరోడ్డున పడే పరిస్థితి ఏర్పడుతుంది.
-ఎన్‌.సాయితేజ, విజయవాడ

పటిష్టమైన విద్యను అందించాలి

ప్రభుత్వ పాఠశాలలు పటిష్టమైన విద్యను అందించాలి. కార్పొ రేట్‌ స్కూళ్లకి దీటుగా కేవలం ఆంగ్లమాధ్యమంతో సరిపెట్ట రాదు. దీనివల్ల గ్రామపల్లె విద్యార్థులకు ఇబ్బందులకు గురవ్ఞ తారు.అదే రీతిన కంప్యూటర్‌ విద్యను కూడా ప్రవేశపెట్టాలి. అంతేకాకుండా యన్‌.సి.సి, స్కాట్స్‌ గైడ్స్‌ వంటి వాటిలో శిక్షణ ఇప్పించి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలి. -ఆమంచర్ల ఉష, తిరుపతి

కల్తీ మందుల విక్రయం
దేశంలో కల్తీమందుల దందా విచ్చలవిడిగాసాగడం పట్ల సుప్రీం కోర్టు తీవ్రఆక్షేపణ తెలియచేస్తూ వచ్చే ఆర్నెళ్లల్లోగా కల్తీ మందు లను నిరోధించేందుకు పటిష్టమైన కార్యాచరణ పట్టాలెక్కించా లని కేంద్రప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయడం ముదావహం. దేశంలో తయారవ్ఞతున్న పేటెంట్‌, షెడ్యూల్డ్‌ ఔషధాలలో 80 శాతం కల్తీమందులు ఉత్పత్తి అవ్ఞతున్నాయని ఇటీవల జాతీయ ఔషధ ధరల నియంత్రణ సంస్థ స్వయంగా ప్రకటించింది. కల్తీ మందులఉత్పత్తి,వినియోగాలలో చైనా,భారత్‌లుమొదటి రెండు స్థానాలలోఉండడం నిజంగాదురదృష్టకరం.డయేరియా, మలేరి యా, న్యూమోనియా, డిఫ్తీరియా వంటి వ్యాధులలో నకిలీ మందుల కారణంగా దేశంలో ఏటా లక్షకుపైగా పసిప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయని జాతీయ వైద్యమండలి స్వయంగా ధృవీకరించింది. దేశంలో కల్తీ మందుల తయారు చేసే అక్రమా ర్కులకు కఠిన శిక్షలు పడేలా చట్టాలలో పస కరవవడం వలన కల్తీమందులు యధేచ్ఛగా చెలామణి అవ్ఞతుండ డం వైద్యఆరోగ్యశాఖ వైఫల్యాన్ని ప్రస్ఫుటం చేస్తోంది.
-సి.హెచ్‌.సాయిప్రతాప్‌, శ్రీకాకుళం

ఉద్యోగుల సమస్యలను తీర్చండి

ఉద్యోగుల అభ్యున్నతికి ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారని ఉద్యో గ ఉపాధ్యాయ కార్మికులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి కట్టుబడి ఉన్నా రని ఆంధ్రప్రదేశ్‌ ఉద్యోగ సంఘాల అధ్యక్షులు ప్రకటించారు. ఉద్యోగసంఘాల సమాఖ్య11డిమాండ్లు కోరుతుందని ఇందులో నివి మెనిఫెస్టోలో తొమ్మిది డిమాండ్లు పెట్టారని, అందులో నాలుగు డిమాండ్లను పరిష్కరించారని ఆయన చెప్పుకొచ్చారు. ఇప్పటి వరకు ఉద్యోగ సంఘాల డిమాండ్లను ప్రభుత్వం ఏవీ పరిష్కరించలేదు. కానీ ఉద్యోగ సంఘాల అధ్యక్షులు మాత్రం ప్రభుత్వం అన్ని చేస్తుందని చెప్పుకొస్తున్నారు. ఇది అన్యాయం. -కె.వి. ప్రసన్నకుమార్‌, ఎల్లవరం, తూ.గోజిల్లా

శిధిలావస్థకు చేరుకున్న పార్కులు

శ్రీకాకుళం జిల్లాలో ప్రజలు కాసేపు సేద తీరేందుకు ఏర్పాటు చేసిన పార్కుల నిర్వహణలో నిర్లక్ష్యం కారణంగా శిధిలావస్థకు చేరుకున్నాయి.కొన్ని మున్సిపాలిటీడంపింగ్‌ యార్డులుగా, రాత్రి ళ్లు పేకాట, మందు తాగడం, వ్యభిచారం వంటి అసాంఘిక కార్యక్రమాలకు నిలయాలుగా మారాయి.ముత్యాలమ్మ కొనేరు- నెహ్రూ పార్కులు పాములపుట్టలతో దర్శనమిస్తుండడం వలన లోపలికి వెళ్లేందుకు ప్రజలు భయభ్రాంతులవ్ఞతున్నారు.
-సి.ప్రతాప్‌, శ్రీకాకుళం

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/