ప్రశాంతంగా పూర్తయిన ఖైర‌తాబాద్ మ‌హా గణనాథుడి నిమజ్జనం

ఖైర‌తాబాద్ మ‌హా గణనాథుడి నిమజ్జనం ప్రశాంతంగా పూర్తయింది. ఎన్టీఆర్ మార్గ్ లోని క్రేన్ నెంబర్ 4 వద్ద ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనం జరిగింది. ఈ అపూర్వ ఘట్టాన్ని తిలకించేందుకు అశేష ప్రజానీకం నిమజ్జన స్థలం వద్దకు చేరుకున్నారు. తొమ్మిది రోజులు ఘ‌నంగా పూజ‌లు అందుకున్న పంచ‌ముఖ మ‌హాల‌క్ష్మి గ‌ణ‌నాథుడికి గంట‌న్న‌ర పాటు పూజ‌లు నిర్వ‌హించారు. అనంత‌రం హుస్సేన్ సాగ‌ర్‌లో గ‌ణ‌నాథుడిని నిమ‌జ్జ‌నం చేశారు. వర్షం కారణంగా గణనాథుడి నిమజ్జనం ఆలస్యమైంది. ఖైర‌తాబాద్ నుంచి టెలిఫోన్ భ‌వ‌న్ మీదుగా హుస్సేన్ సాగ‌ర్ వ‌ర‌కు 6 గంట‌ల‌కు పైగా శోభాయాత్ర కొన‌సాగింది. ఎన్టీఆర్ మార్గ్ క్రేన్ నంబ‌ర్ 4 వ‌ద్ద ఖైర‌తాబాద్ మ‌హాగ‌ణ‌ప‌తి నిమ‌జ్జ‌న ప్ర‌క్రియ‌ను నిర్వ‌హించారు.

ఈ సారి పంచముఖ మహాలక్ష్మీ గణపతిగా కొలువుదీరిన ఖైరతాబాద్ గణనాథుడు గంగమ్మ ఒడికి చేరాడు. 50 అడుగుల ఎత్తులో మట్టి తో చేసిన మహాగణపతికి చాలా ప్రత్యేకతులు ఉన్నాయి. మట్టితో విగ్రహ తయారు చేయడంతో 60 నుండి 70 టన్నులకు విగ్రహ బరువు చేరింది. విగ్రహ నిమర్జన తరలింపుకు 70 అడుగుల పొడువు, 11 అడుగుల వెడల్పు ఉన్న 26 టైర్ల టస్కర్ వాహనం ఏర్పాటు చేశారు అధికారులు. 100 టన్నుల బరువు మోయనున్న వాహనం.. ఖైరతాబాద్ విగ్రహాన్ని అవలీలగా తీసుకువచ్చింది.