ఎమ్మెల్యే మృతి పట్ల సిఎం కెసిఆర్‌ దిగ్భ్రాంతి

ఒకే ప్రాంతానికి చెందిన వారమని గుర్తు చేసుకున్న సిఎం

cm kcr-Solipeta Ramalinga Reddy

హైదరాబాద్‌: దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మృతి పట్ల సిఎం కెసిఆర్‌ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఆయన మృతికి సంతాపం ప్రకటించి, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. తనతో పాటు ఉద్యమంలో ఆయన పాల్గొన్నారని, తామిద్దరమూ ఒకే ప్రాంతానికి చెందిన వారమని గుర్తు చేసుకున్నారు. ఈ మేరకు తెలంగాణ సిఎంఓ ద్వారా ఓ ప్రకటన జారీ అయింది.

‘ఎమ్మెల్యే శ్రీ సోలిపేట రామలింగారెడ్డి మరణం పట్ల సిఎం కెసిఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఉద్యమ సహచరుడిగా, ఒకే ప్రాంత వాసిగా తనతో ఎంతో అనుబంధం ఉందని సీఎం గుర్తుచేసుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థించారు’ అని సిఎంఓ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పేర్కొంది.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/