భారీ వరద .. శ్రీరాంసాగర్‌ 9 గేట్లు ఎత్తివేత

sriram-sagar-9-gates-lifted-with-huge-floods

నిజామాబాద్‌ః భారీ వర్షాలతో శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతున్నది. జలాశయంలోకి 85,740 క్యూసెక్కుల నీరు వస్తున్నది. దీంతో అధికారులు 9 గేట్లను ఎత్తివేసి 41 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులుకాగా, ప్రస్తుతం 1087.6 అడుగుల వద్ద నీటిమట్టం ఉన్నది. ఇక జలాశయంలో 90.3 టీఎంసీల నీటిని నిల్వ చేయవచ్చు. ఇప్పుడు 75.15 టీఎంసీల నీరు ఉన్నది.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని తాలిపేరు ప్రాజెక్టుకు వరద ఉధృతి పెరుగుతున్నది. దీంతో అధికారు 19 గేట్లు ఎత్తివేసి వచ్చిన నీటిని వచ్చినట్లు దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టులోకి ప్రస్తుతం 29,145 క్యూసెక్కుల నీరు వస్తుండగా, 26,182 క్యూసెక్కుల నీరు బయటకు వెళ్తున్నది. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 74 మీటర్లు కాగా, ప్రస్తుతం 70.50 మీటర్ల వద్ద నీరు ఉంది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/news/national/