ఇంకా విషమంగానే తారకరత్న ఆరోగ్యం..ఆసుపత్రి బులెటిన్ విడుదల
నారాయణ హృదయాలయలో కొనసాగుతున్న చికిత్స

బెంగళూరుః నందమూరి తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రి బులెటిన్ విడుదల చేసింది. తారకరత్నను గత రాత్రి 1 గంటకు కుప్పం నుంచి బెంగళూరు నారాయణ హృదయాలయ ఆసుపత్రికి తీసుకువచ్చారని ఆ బులెటిన్ లో వెల్లడించారు. అప్పటికి ఆయన ఆరోగ్యం అత్యంత విషమంగా ఉందని తెలిపారు. నిపుణులతో కూడిన తమ వైద్యబృందం ప్రస్తుతం తారకరత్న ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తోందని, ఆయన పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని ఆ బులెటిన్ లో స్పష్టం చేశారు.
పూర్తిగా వైద్యసాయంపైనే ఆయన ఆధారపడి ఉన్నారని, రానున్న రోజుల్లోనూ తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై నిశిత పరిశీలన, చికిత్స కొనసాగుతాయని వివరించారు. ఈ సమయంలో తారకరత్నను సందర్శించేందుకు ఎవరూ రావొద్దని, చికిత్సకు ఆటంకం కలిగించవద్దని నారాయణ హృదయాలయ బులెటిన్ లో విజ్ఞప్తి చేశారు.
తాజా ఏపి వార్తల కోసం క్లిక్ చేయండిః https://www.vaartha.com/category/andhra-pradesh/