టిఆర్ఎస్ కు షాక్ ఇచ్చిన సీపీఎం

అధికార పార్టీ టిఆర్ఎస్ కు సీపీఎం పార్టీ షాక్ ఇచ్చింది. టిఆర్ఎస్ పార్టీ తో సీపీఎం కలిసి పనిచేస్తుందని..రాబోయే అన్ని ఎన్నికల్లో మద్దతు ఇస్తుందని అంత అనుకుంటున్నా వేళ..సీపీఎం మాత్రం కేవలం మునుగోడు ఉప ఎన్నికల్లో మాత్రమే మద్దతు ఇస్తామని తెలిపి షాక్ ఇచ్చింది. మా రాష్ట్ర కమిటీ నిర్ణయం మేరకు మునుగోడు లో బీజేపీ ఓడించడానికి టీఆరెస్ కి మద్దతు ఇస్తున్నామన్నారు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం.

గురువారం ఉదయం సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మీడియాతో మాట్లాడుతూ… మునుగోడు లో తమకే సపోర్ట్ చేయాలని అన్ని పార్టీలు కోరాయని తెలిపారు. అయితే బీజేపీ ని ఓడగొట్టడానికి టీఆర్ఎస్‌కు మద్దతు తెలపాలని నిర్ణయించుకున్నామన్నారు. అభివృద్ది కోసమే రాజీనామా చేశానని రాజగోపాల్ చెప్పడం కేవలం సాకు మాత్రమే అని విమర్శించారు. రాజగోపాల్ ఎందుకు రాజీనామా చేశాడో అమిత్ షా క్లియర్‌గా చెప్పారని అన్నారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ వర్సెస్ టీఆర్ఎస్‌గా ఉండబోతోందని… దీన్ని బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్‌గా మార్చబోతున్నారని తెలిపారు.