‘వైఎస్‌ఆర్‌ కాపు నేస్తం’ ప్రారంభించిన సిఎం

YouTube video
Disbursing of ”KAAPU NESTAM” Financial Assistance by Hon’ble CM of AP at CM Camp office

అమరావతి: ఏపిలో సిఎం జగన్‌ ‘వైఎస్‌ఆర్‌ కాపు నేస్తం’ పథకాన్ని బుధవారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రారంభించారు. ఈ సందర్భంగా సిఎం జగన్‌ మాట్లాడుతూ.. 13 నెలల పాలనలో ఎక్కడా వివక్షకు తావు ఇవ్వలేదు. రాజకీయాలకతీతంగా సంక్షేమ పథకాలు అందిస్తున్నాము. 3.98 కోట్ల మందికి 43వేల కోట్ల రూపాయలు నేరుగా అందించాం. అమ్మఒడి, వసతిదీవెన, విద్యాదీవెన, రైతు భరోసా, పెన్షన్ కానుక, వాహనమిత్ర, జగనన్న చేదోడు, నేతన్న నేస్తం, ఇళ్ల పట్టాల వంటి సంక్షేమ పథకాలతో అన్ని వర్గాలకు మేలు చేశాం. కాగా నేడు.. కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు చెందిన మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ఆర్ధిక సాయం చేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా 2,37,873 మంది కాపు మహిళల ఖాతాల్లో రూ.15వేల చొప్పున జమచేస్తున్నాం. గత ప్రభుత్వం కాపులకు ఏడాదికి 400 కోట్ల రూపాయలు కూడా కేటాయించలేకపోయింది’ అంటూజగన్‌ పేర్కొన్నారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/