లైగర్ టీం కు తమ్మారెడ్డి చురకలు..

లైగర్ సినిమా రావడం..డిజాస్టర్ అవ్వడం జరిగిపోయింది. భారీ అంచనాల నడుమ దేశ వ్యాప్తంగా పలు భాషల్లో విడుదలైన ఈ చిత్రం వారం తిరగకముందే థియేటర్స్ నుండి బయటకు వెళ్లేందుకు సిద్ధమైంది. ఈ సినిమా ప్లాప్ తో డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లకు భారీ నష్టాలూ వచ్చాయి. కాగా ఈ చిత్ర టీం ఫై అభిమానులే కాదు సినీ ప్రముఖులు సైతం పరోక్షంగా చివాట్లు పెడుతున్నారు. సినిమా ఫై అంచనాలు పెరిగిపోవడానికి కారణం.. హీరో , డైరెక్టరే అని ..మా సినిమా రికార్డ్స్ బ్రేక్ చేస్తుందని…సినిమా ఓ రేంజ్ లో వచ్చిందని..ఇండియన్ సినిమా అని ఓ అదరగొట్టారు. కానీ వీరు చెప్పినదానికి…సినిమాలో కంటెంట్ కు ఏమాత్రం సంబంధం లేదు. అసలు ఇది సినేమానా అని అభిమానులే తిట్టుకుంటున్నారు.

ఇదిలా ఉంటె తాజాగా సీనియర్ డైరెక్టర్ , నిర్మాత తమ్మారెడ్డి పరోక్షంగా సినిమా యూనిట్ ఫై ఆగ్రహం వ్యక్తం చేసారు. ఎగిరెగిరి పడితే ఇలాంటి అనుభవాలే ఎదురవుతాయని ఆయన అన్నారు. కేవలం సినిమా అనే కాకుండా… ఏ విషయంలో కూడా ఎవరూ ఎగిరెగిరి పడకూడదని చెప్పారు. ఇలా చేస్తే చివరకు ఎదురుదెబ్బలే మిగులుతాయని అన్నారు.

తామంతా ఎంతో కష్టపడి సినిమా చేశామని… తమ సినిమాను ఆదరించాలని, తమ సినిమాను చూడాలని ప్రేక్షకులను కోరుతూ ప్రమోషన్ చేసుకుంటే బాగుంటుందని తమ్మిరెడ్డి చెప్పారు. ఇలా కాకుండా చిటికెలు వేస్తూ మాట్లాడితే… ప్రేక్షకులు ఇచ్చే సమాధానం ఇలాగే ఉంటుందని అన్నారు. ‘లైగర్’ ట్రైలర్ చూసినప్పుడే సినిమా చూడాలని తనకు అనిపించలేదని అన్నారు. తాను పూరీ జగన్నాథ్ అభిమానినని, ఆయన సినిమాలంటే తనకు చాలా ఇష్టమని… అయినప్పటికీ, ట్రైలర్ తోనే ‘లైగర్’పై తనకు ఆసక్తి పోయిందని అన్నారు.