ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజీనామాపై స్పీకర్ తమ్మినేని స్పందన

ysrcp-mangalagiri-mla-alla-ramakrishna-reddy-resigns

మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణ రెడ్డి తన పదవికి , అలాగే వైసీపీ పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. రెండు , మూడు నెలల్లో ఎన్నికలు రాబోతున్న క్రమంలో రామకృష్ణ రాజీనామా చేయడం అందర్నీ షాక్ కు గురి చేసింది. తన వ్యక్తిగత కారణాల వల్లే రాజీనామా చేసినట్లు ఆళ్ల చెప్పుకొచ్చారు. ఇక స్పీకర్ తమ్మినేని సీతారాం ఓఎస్డీకి తన రాజీనామా లేఖను ఆర్కే స్వయంగా అందజేశారు. రాజీనామాపై తమ్మినేని స్పందిస్తూ… ఆర్కేతో స్వయంగా మాట్లాడి రాజీనామా ఎందుకు చేశారో తెలుసుకుంటానని ఆయన తెలిపారు. ఆయన ఎందుకు రాజీనామా చేశారో తనకు తెలియదని చెప్పారు.

రాజీనామాను ఆమోదించడానికి కొన్ని పద్ధతులు ఉన్నాయని అన్నారు. నిబంధనలకు అనుగుణంగానే తాను వ్యవహరిస్తానని చెప్పారు. ఇదిలా ఉంటె ఆళ్ల రాజీనామా చేయడం తో వెంటనే అధిష్టానం మంగళగిరి వైసీపీ ఇంచార్జ్ గా గంజి చిరంజీవి ని నియమించింది. అలాగే రాబోయే ఎన్నికల్లో ఆయనికి మంగళగిరి టికెట్ ఇవ్వనుందని ప్రచారం జరుగుతుంది.