సీఎం కెసిఆర్‌ మానసపుత్రిక పట్టణ ప్రగతి

ప్రతీ ఒక్కరూ పచ్చదనంపై దృష్టి సారించాలి

jagadeesh reddy
jagadeesh reddy

సుర్యాపేట: ముఖ్యమంత్రి కెసిఆర్‌ మానసపుత్రిక పట్టణ ప్రగతి అని మంత్రి జగదీష్‌ రెడ్డి అన్నారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా సుర్యాపేటలోని 33వ వార్డులో జగదీష్‌ రెడ్డి ఆకస్మిక తనిఖీ చేశారు. కాన్వా§్‌ు పక్కన పెట్టి ఇంటింటికి వెళ్లి కాలనీ వాసులతో మంత్రి ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ప్రతీ ఒక్కరూ తమ ఇళ్లలో పచ్చదనంపై దృష్టి సారించాలని కాలనీ వాసులకు విజ్ఞప్తి చేశారు. గ్రీనరీ పెంచడానికి స్థలం లేని వారు రూఫ్‌ గార్డెన్‌లపై దృష్టి సారించాలన్నారు. మున్సిపాలిటీలో 10శాతం నిధులు పచ్చదనం పెంపునకు ఖర్చు చేయాలన్నారు. పట్టణాల్లో పారిశుద్యం, పచ్చదనం పెరగాలని..నాటిన మొక్కల్లో 85 శాతం బతకాలన్నారు. 75 గజాల లోపల ఇల్లుకట్టుకుంటే ఎలాంటి అనమతి అవసరం లేదని జగదీష్‌ రెడ్డి స్పష్టం చేశారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/business/