రాజమౌళికి భయం వేసినప్పుడల్లా సిరివెన్నెల పాట గుర్తుచేసుకుంటాడట..ఆ పాట ఏదో తెలుసా..?

రాజమౌళికి భయం వేసినప్పుడల్లా సిరివెన్నెల పాట గుర్తుచేసుకుంటాడట..ఆ పాట ఏదో తెలుసా..?

సిరివెన్నెల ఇక లేరు..ఈ విషయం తెలిసి అందరు షాక్ అవుతున్నారు. కేవలం సినీ ప్రముఖులు , సినీ ప్రేక్షకులే కాదు రాజకీయ ప్రముఖులు , ప్రధాని మోడీ , సుప్రీమ్ కోర్ట్ జడ్జ్ సైతం విచారం వ్యక్తం చేసారు. సిరివెన్నెల గురించి స్పందిస్తూ వస్తున్నారు.

ఈ క్రమంలో దర్శక ధీరుడు రాజమౌళి సిరివెన్నల మరణం పట్ల ఎమోషనల్ కు గురి అవుతూ సోషల్ మీడియా లో ఓ పోస్ట్ పెట్టారు. ”1996లో మేము అర్థాంగి అనే సినిమాతో సంపాదించుకున్న డబ్బు, పేరు మొత్తం పోయింది. వచ్చే నెల నుంచి ఇంటి అద్దె ఎలా కట్టాలో తెలియని స్థితి. అలాంటి పరిస్థితుల్లో నాకు ధైర్యాన్నిచ్చి, వెన్నుతట్టి ముందుకు నడిపించినవి ‘ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి.. ఎప్పుడూ వదులు కోవద్దురా ఓరిమి’ అన్న సీతారామ శాస్త్రి గారి పదాలు.. భయం వేసినప్పుడల్లా గుర్తు చేసుకొని పాడుకుంటే ఎక్కడ లేని ధైర్యం వచ్చేది.

అప్పటికి నాకు శాస్త్రి గారితో పరిచయం చాలా తక్కువ. మద్రాసులో డిసెంబర్ 31వ తారీకు రాత్రి 10 గంటలకు ఆయన ఇంటికి వెళ్ళాను. ‘ఏం కావాలి నందీ’ అని అడిగారు. ఒక కొత్త నోట్ బుక్ ఆయన చేతుల్లో పెట్టి మీ చేత్తో ఆ పాట రాసివ్వమని అడిగాను. రాసి.. సంతకం చేసి ఇచ్చారు. జనవరి 1న మా నాన్నగారికి గిఫ్ట్‌గా ఇచ్చాను. నాన్న గారి కళ్ళలో ఆనందం, మాటల్లో కొత్తగా ఎగదన్నుకొచ్చిన విశ్వాసం ఎప్పటికీ మర్చిపోలేను అంటూ పోస్ట్ చేసారు.