చిరంజీవి వ్యాఖ్యలపై తమ్మారెడ్డి కామెంట్స్

ఇండస్ట్రీ కి పెద్ద దిక్కు గా నేను ఉండను అని చిరంజీవి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీ లో సంచలంగా మారాయి. చిరు చేసిన కామెంట్స్ గురించి చాలామంది మాట్లాడుకుంటున్నారు. ఈ క్రమంలో చిరు వ్యాఖ్యలపై ప్రముఖ నిర్మాత దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ స్పందించారు. ”చిరంజీవి మాట్లాడిన దాంట్లో తప్పేం లేదు. ఇండస్ట్రీ మొత్తం ఆయన్ని పెద్ద దిక్కుగా భావించినప్పటికీ.. గత కొంతకాలంగా జరిగిన పరిస్థితుల రీత్యా ఆయన విసిగిపోయి ఈ విధంగా వ్యాఖ్యలు చేసి ఉండొచ్చు” అని తమ్మారెడ్డి అభిప్రాయపడ్డారు.

”సినిమా టికెట్ ధరల విషయంలో చిరంజీవి మాట్లాడటానికి ముందుకు రావడం లేదని కామెంట్స్ చేస్తున్నారు. నిజం చెప్పాలంటే ఆయన ఎందుకు రావాలి? ఈ విషయంపై ముందు ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ – డిస్ట్రిబ్యూటర్స్ – ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ స్పందించాలి. ఒకవేళ వాళ్ల వల్ల సమస్య పరిష్కారం కానప్పుడు చిరంజీవి – బాలకృష్ణ లేదా నాగార్జున – మోహన్ బాబు దగ్గరకు వెళ్లి ఏదైనా సాయం కోరాలి” అని తమ్మారెడ్డి అన్నారు.