పుల్వామాలో ఎదురుకాల్పులు..ఇద్దరు ఉగ్రవాదులు హతం

శ్రీనగర్‌: జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. కశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో కస్బయార్‌ ప్రాంతంలో బుధవారం తెల్లవారుజామున ముష్కరులకోసం భద్రతా దళాలు గాలింపు చేపట్టాయి. ఈ సందర్భంగా గాలింపు బృందంపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ప్రతిగా భద్రతా బలగాల కాల్పుల్లో ఇద్దరు టెర్రరిస్టులు హతమయ్యారు. మృతిచెందినవారిని జైషే మహమ్మద్‌ టాప్‌ కమాండర్‌ యాసిర్‌, ఐఈడీ ఎక్స్‌పర్ట్‌ అయిన విదేశీ ఉగ్రవాది ఫర్క్వాన్‌గా గుర్తించామని కశ్మీర్‌ ఐజీ తెలిపారు.

తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/business/