పన్ను గడువు జూన్ 30
2018-19 ఆర్థిక సంవత్సరానికి ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేయడానికి చివరి తేదీ జూన్ 30 వరకు పొడిగించబడింది: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్

New Delhi: పన్ను చెల్లింపు దారులకు ఉపశమనం కలిగేలా ఐటీఆర్ ఫైలింగ్, ఆధార్-పాన్ అనుసంధానం, జీఎస్టీ రిట్నర్స్ గడువు తేదీలను పొడిగిస్తున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు.
ఢిల్లీలో ఆమె మీడియాతో మాట్లాడుతూ, ఈ గడువు తేదీలను ఏప్రిల్ 1 నుంచి జూన్ 30 వరకు పొడిగిస్తున్నట్టు తెలిపారు.
విశ్వాస్ పథకం గడువు తేదీని కూడా ఏప్రిల్ 1 నుంచి జూన్ 30 వరకు పొడిగిస్తున్నట్టు చెప్పారు. 10 శాతం చెల్లింపులపై ఎలాంటి అదనపు ఛార్జీలు ఉండవన్నారు.
దేశంలో ఆర్థిక వ్యవస్థపై కరోనా ప్రభావాన్ని తగ్గించేందుకు ఆర్థిక మంత్రిత్వ శాఖ కృషి చేస్తోందని అన్నారు. ఆధార్-పాన్ అనుసంధానం గడవు తేదీని జూన్ 30 వరకు పొడిగించినట్టు తెలిపారు.
టీడీఎస్ డిపాజిట్లు ఆలస్యమైతే ఆయా వడ్డీ రేట్లపై 12శాతం నుంచి 9శాతానికి తగ్గించినట్టు చెప్పారు. ఈ తేదీ మరోసారి పొడిగింపు ఉండదని తెలిపారు.
ఇన్ కమ్ ట్యాక్స్ రిటర్న్స్ గడువు తేదీని కూడా జూన్ 30 వరకు పొడిగించినట్టు నిర్మల చెప్పారు. ఆలస్యంగా చేసే చెల్లింపులపై వడ్డీలను తగ్గిస్తున్నట్టు తెలిపారు. అంతేకాదు.. బ్యాంకులకు సంబంధించి కంపైలెన్స్ ఇష్యూలపై కూడా సీతారామన్ ప్రకటన చేశారు.
కరోనా ప్రభావాన్ని ఎదుర్కున్న పరిశ్రమలకు ఆర్థిక ప్యాకేజీని అందించే దిశగా మోడీ ప్రభుత్వం పనిచేస్తోందని నిర్మలా సీతారామన్ అన్నారు.
ప్రత్యేకమైన బయోమెట్రిక్ ఐడి ఆధార్‌తో పాన్‌ను లింక్ చేయడానికి చివరి తేదీని మార్చి 31 నుంచి జూన్ 30 వరకు ప్రభుత్వం పొడిగించిందని అన్నారు
తాజా వార్త ఇ-పేపర్ కోసం క్లిక్ చేయండి: https://epaper.vaartha.com/