గణేష్‌ ఉత్సవాలపై మరోసారి నిర్ణయం తీసుకుంటాం

talasani srinivasa yadav
talasani srinivasa yadav

హైదరాబాద్‌: హైద్రాబాద్‌లో గణేష్ ఉత్సవాల నిర్వహణపై ఎంసీఆర్ హెచ్చార్డీలో మంత్రులు సమీక్ష సమావేశం నిర్వహించారు. మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, నగరంలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్ కుమార్, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్, కలెక్టర్ శ్వేతా మహంతి, డీజీపీ మహేందర్ రెడ్డి, భాగ్యనగర్ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు సమావేశానికి హాజరయ్యారు.

ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ..హైదరాబాద్‌లో ఎప్పుడు గణేష్ ఉత్సవాలు ఘనంగా జరుగుతాయని పేర్కొన్నారు. ప్రస్తుతం కరోనా నేపథ్యంలో ఈ ఏడాది గణేష్ ఉత్సవాలను ఎలా నిర్వహించాలనే అనే అంశంపై చర్చించామన్నారు. మరోసారి సమావేశం అయ్యి ఉత్సవాలు ఎలా నిర్వహించాలనే అంశంపై తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. విగ్రహాల ఎత్తుపై ఆంక్షలు పెట్టాలని ప్రభుత్వానికి లేదని తలసాని స్పష్టం చేశారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/