ఈ ప్రమాద ఘటన బాధాకరం..కవిత
విమాన ప్రమాదంపై మాజీ ఎంపి కవిత దిగ్భ్రాంతి

హైదరాబాద్: మాజీ ఎంపి కవిత కేరళ విమాన ప్రమాద ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాద ఘటన బాధాకరమని ఆమె పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించిన ఆమె.. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో 174 మంది ప్రయాణికులు, 10 మంది చిన్నారులు, ఇద్దరు పైలట్లు, నలుగురు సిబ్బంది ఉన్నారు. వీరిలో 18 మంది ప్రాణాలు కోల్పోయారు. క్షతగాత్రులంతా కోజికోడ్, మలప్పురం ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మృతుల కుటుంబాలకు తక్షణ సహాయం కింద కేంద్రం రూ. 10 లక్షల చొప్పున పరిహారం ప్రకటించింది.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/national/