నేడు రాహుల్ తో టీ-కాంగ్రెస్ నేతల సమావేశం

హైదరాబాద్: తెలంగాణపై కాంగ్రెస్ అధిష్టానం దృష్టిసారించింది. ఈ నేపథ్యంలోనే నేడు రాహుల్ గాంధీ తో తెలంగాణ కాంగ్రెస్ నేతల కీలక సమావేశం జరుగనుంది. ఈ సమావేశం లో తెలంగాణ లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి పై చర్చించనున్నారు నేతలు. అలాగే… తెలంగాణలో ప్రజా సమస్యల పై ఆందోళనలు, పార్టీ పటిష్టం కోసం కార్యాచరణ పై సమాలోచనలు చేయనున్నారు. ఇక ఈ నేపథ్యం లోనే ఈ రోజు మధ్యాహ్నం 3.30 గంటలకు రాహుల్ తో సమావేశం కానున్నారు.

ఈ సమావేశానికి తెలంగాణ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తో పాటు రాహుల్ గాంధీ తో గీతా రెడ్డి, దామోదర్ రాజనర్సింహ, జగ్గారెడ్డి, మహేశ్వర్ రెడ్డి, అజ్మతుల్లా, అజరుద్దీన్, మధుగౌడ్, మహేష్ గౌడ్ సమావేశం కానున్నారు. అంతేకాదు,.. రాహుల్ గాంధీ తో సి.ఎల్.పి నాయకుడు భట్టి విక్రమార్క కూడా సమావేశం కానున్నారు. ఇవాళ మధ్యాహ్నం తర్వాత ఈ సమావేశం కానుంది.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/news/international-news/