కీస‌ర‌లో కుటుంబం ఆత్మ‌హ‌త్య‌

ఇద్ద‌రు చిన్నారులు స‌హా దంప‌తుల‌ ఆత్మ‌హ‌త్య‌

కీసర : కీసర మండలంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు శుక్రవారం తెల్లవారుజామున ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన నాగారం గ్రామంలో చోటు చేసుకుంది. కుటుంబ కలహాలతో ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని కేసు నమోదు చేశారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/national/