ఏపీలో ఆడవాళ్ల మిస్సింగ్ ఫై పవన్ సంచలన వ్యాఖ్యలు

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదివారం ఏలూరు సభలో పలు కీలక వ్యాఖ్యలు చేసారు. ముఖ్యంగా ఏపీలో ఆడవాళ్ల మిస్సింగ్ వెనుక గ్రామ వాలంటీర్ల సంబంధం ఉందని పలు అనుమానాలు లేవనెత్తారు. రాష్ట్రంలో ఎన్నికల సమయం దగ్గర పడుతుండడం తో పవన్ కళ్యాణ్ మరింత ఫోకస్ పెట్టారు. రీసెంట్ వారాహి యాత్ర మొదటి దశను పూర్తి చేసిన పవన్..నిన్న ఆదివారం నుండి రెండో దశ యాత్ర మొదలుపెట్టారు. ఏలూరు నుండి మొదలైన ఈ యాత్ర నాల్గు రోజుల పాటు కొనసాగనుంది.

ఈసారి నేరుగా అధికార పార్టీ ని , ఆ పార్టీ బలాలను టార్గెట్ చేశారు. ఏలూరులో జరిగిన వారాహి విజయ యాత్రలో సీఎం జగన్‌పై కౌంటర్లు విసరటమే కాదు ఏపీలో వైస్సార్సీపీ ప్రధాన బలంగా చెప్పుకునే వాలంటీర్ల వ్యవస్థ మీద సంచలన వ్యాఖ్యలే చేశారు. మన రాష్ట్రం లోనే కాదు, దేశం లో హ్యూమన్ ట్రాఫికింగ్ అనేది దేశంలోనే అతిపెద్ద సమస్యగా మారుతోంది. ఇది నిన్న మొన్న పుట్టిన సమస్య కాదు, ఎప్పటి నుండో ఉన్న సమస్య. అయితే మన ఆంధ్రప్రదేశ్ లో ఈ హ్యూమన్ ట్రాఫికింగ్ అనేది ఎక్కువ జరుగుతున్నాయి. 30 వేల మందికి పైగా ఆడవాళ్లు మిస్ అయితే ఇప్పటికి కేవలం 14 వేల మంది మాత్రమే తిరిగి వచ్చారు, మిగిలిన 16 వేల మంది ఆడవాళ్ళ ఆచూకీ ఇప్పటి వరకు ఎందుకు తెలియలేదు?, కారణం ఏమిటి ? అనేది ఎవరికీ అంతు చిక్కని ప్రశ్న. ఏపీ ప్రభుత్వం కూడా దీని మీద ఇప్పటి వరకు సీరియస్ యాక్షన్ తీసుకోలేదు. పోలీసులతో కూర్చొని రివ్యూ మీటింగ్స్ ఇప్పటి వరకు జరిపించలేదన్నారు.

‘ వైస్సార్సీపీ లో కొంతమంది కీలక నేతలు వాలంటీర్ వ్యవస్థని వాడుకొని, ప్రతీ ఇంటికి వెళ్లి ఎంత మంది కుటుంబ సభ్యులు ఉన్నారు, ఎంత మంది ఆడవాళ్లు ఉన్నారు అనే సమాచారం సేకరించి, ఆ తర్వాత వాళ్ళని మాయం చేస్తున్నట్టుగా కేంద్ర ప్రభుత్వం నా దృష్టికి తీసుకొచ్చింది. దయచేసి దానిని ఆంధ్ర ప్రజలకు తెలియచేసే బాధ్యత తీసుకోండి అని నాకు చెప్పారు, అందుకే నేను ఈరోజు మీ ముందు వాటి గురించి చెప్తున్నాను’ అంటూ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.

ఆయన ఉద్దేశ్యం లో వాలంటీర్లు సేకరించిన సమాచారం ని వైస్సార్సీపీ కి చెందిన కొందరు నాయకులు దుర్వినియోగం చేస్తున్నారని. అంతే కానీ , వాలంటీర్స్ ఈ పని చేస్తున్నారని కాదు, మరి ఇలా వ్యక్తుల వివరాలను దుర్వినియోగ పర్చడం అనేది చట్టరీత్యా పెద్ద నేరం, మరి దీనిపై సీఎం జగన్ దర్యాప్తు చేయించి చర్యలు తీసుకుంటారా లేదా అనేది చూడాలి.