హైదరాబాద్‌కు చేరిన చరితారెడ్డి మృతదేహం

Charitha Reddy
Charitha Reddy

హైదరాబాద్‌: నగరానికి చెందిన చరితా రెడ్డి మృతదేహాం శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకుంది. తెలంగాణకు చెందిన చరితారెడ్డి అమెరికాలోని మిచిగాన్‌ పరిధిలోని లాన్సింగ్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా ఆమె మృతదేహాన్ని స్వదేశానికి తరలించేందుకు ఆమె స్నేహితులు చేయీ చేయీ కలిపారు. అందరూ కలిసి ఫేస్‌బుక్‌ ఆధారంగా ప్రత్యేక ఖాతా ద్వారా క్రౌడ్‌ ఫండింగ్‌ సంపాదించారు. చరితారెడ్డి పార్థివ దేహాన్ని హైదరాబాద్‌ తరలించేందుకు అయ్యే ఖర్చుల కోసం దీనిని ఉపయోగించుకున్నట్లు తెలిపారు. కాగా మరికాసేపట్లో చరితారెడ్డి మృతదేహం విమానాశ్రయం నుంచి నేరేడ్‌మెట్‌ రేణుకానగర్‌లోని ఆమె నివాసానికి తరలించనున్నారు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/