రావణాసుర నుండి సుశాంత్ ఫస్ట్ లుక్ విడుదల

మాస్ మహారాజ రవితేజ హీరోగా నటిస్తున్న రావణాసుర నుండి సుశాంత్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసారు చిత్ర యూనిట్. క్రియేటివ్ డైరెక్టర్ సుధీర్ వర్మ డైరెక్షన్లో.. నావెల్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఈ మూవీ లో సుశాంత్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. మంగళవారం సుశాంత్ తాలూకా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసారు. ఈ సినిమాలో రామ్ అనే పాత్రలో సుశాంత్ కనిపించబోతున్నాడు. ‘అల వైకుంఠపురములో’ వంటి బ్లాక్ బస్టర్ చిత్రంలో భాగమైన అక్కినేని హీరో.. ఇప్పుడు రవితేజ స్క్రిప్ట్ నచ్చడంతో ముఖ్య పాత్ర పోషించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

ఇక ఈ ఫస్ట్ లుక్ విషయానికి వస్తే..ఈ పోస్టర్ లో సుశాంత్ నీలం కళ్ళు పొడవాటి జుట్టు – గడ్డంతో చాలా దృఢంగా కనిపిస్తున్నాడు. అతను రామ్ అయినప్పటికీ ‘హీరోలు ఉనికిలో లేరు.. కానీ రాక్షసులు ఉన్నారు’ అనే క్యాప్షన్ ని బట్టి చూస్తే సుశాంత్ పాత్రకు ప్రాధాన్యత ఉంటుందని అర్థం అవుతుంది. ఇక ఈ చిత్రంలో రవితేజ లాయర్ గా కనిపించనున్నారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని జనవరి 14న హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్ లో ‘రావణాసుర’ పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభం కానుంది. ఈ చిత్రాన్ని అభిషేక్ పిక్చర్స్ మరియు ఆర్టీ టీమ్ వర్క్స్ బ్యానర్స్ మీద నిర్మాత అభిషేక్ నామా ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. శ్రీకాంత్ విస్సా ఈ చిత్రానికి పవర్ ఫుల్ స్టోరీ అందిస్తున్నారు.