అర్థనగ్నంగా బీచ్ లో దిశా పటానీ

దిశా పటానీ పరిచయం అవసరం లేని భామ. నిత్యం హాట్ హాట్ ఫోటో షూట్స్ తో వీడియోస్ తో యూత్ లో వేడి సెగలు పుట్టించే ఈ భామ..తాజాగా అర్థనగ్నంగా బీచ్ లో నిల్చుని హాట్ పోజ్ ఇచ్చింది. చిన్న వయసులోనే మోడల్‌గా తన ప్రయాణాన్ని మొదలు పెట్టింది దిశా పటానీ. అందులో పర్‌ఫెక్ట్ ఫిగర్‌తో మాయ చేసిన ఈ బ్యూటీ.. అందరి దృష్టినీ ఆకర్షించింది. అదే సమయంలో ఎన్నో బ్రాండ్లకు అంబాసీడర్‌గా వ్యవహరించింది.

ఈ క్రమంలోనే పూరీ దర్శకత్వంలో వరుణ్ తేజ్ నటించిన ‘లోఫర్’ సినిమాతో దిశా పటానీ హీరోయిన్‌గా ప్రయాణాన్ని మొదలు పెట్టింది. ఈ మూవీ సక్సెస్ కాకపోయేసరికి మరో ఛాన్స్ దక్కలేదు. ఇదే సమయంలో బాలీవుడ్ లో వరుస అవకాశాలు అమ్మడిని మరింత పాపులర్ చేసాయి. ఓ పక్క సినిమా అవకాశాలతో బిజీ గా ఉంటూనే మరోపక్క హాట్ హాట్ ఫోటో షూట్స్ తో సోషల్ మీడియా ను షేక్ చేస్తూ వస్తుంది.

తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ ఫొటోను షేర్ చేసింది. ఇందులో ఆమె సముద్రపు అలల మధ్యన నిల్చుని ఉంది. ఇందులో కేవలం టూ పీస్ బికినీ మాత్రమే ధరించి ఉంది. దీంతో బ్యాక్ నుంచి ఆమె అందాలు కనువిందు చేస్తున్నాయి. దీంతో ఈ పిక్ చాలా తక్కువ సమయంలోనే వైరల్ అయిపోయింది. ఈ పిక్ చూసిన వారంతా కనీసం ఆ రెండు పీస్ ల బరువు 50గ్రాములు అయినా ఉండదని కామెంట్స్ చేస్తున్నారు.