సుశాంత్ బర్త్ డే స్పెషల్ : ‘రావణాసుర’ పోస్ట‌ర్

డైరెక్టర్ సుధీర్ వర్మ యాక్షన్ థ్రిల్లర్

Sushanth's Birthday Special- 'Ravanasura' Poster
Sushanth’s Birthday Special- ‘Ravanasura’ Poster

మాస్ మహారాజా రవితేజ, క్రియేటివ్ డైరెక్టర్ సుధీర్ వర్మల ప్రత్యేకమైన యాక్షన్ థ్రిల్లర్ రావణాసుర. కీల‌క‌మైన భారీ షూటింగ్ షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది. రవితేజతో పాటు కీలక పాత్రలో నటిస్తున్న సుశాంత్ కూడా షూటింగ్‌లో పాల్గొన్నారు. ఈరోజు సుశాంత్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ టీమ్ సరికొత్త పోస్టర్‌ను విడుదల చేసింది. సుశాంత్ నీలి రంగు క‌ళ్ళ‌తో, పొడవాటి జుట్టు, గడ్డంతో తీక్ష‌ణంగా చూస్తున్నట్లు క‌నిపిస్తున్నాడు.

దీనిని బ‌ట్టి ఆయ‌న పాత్ర వైవిధ్యంగా వుంటుంద‌ని అర్థ‌మ‌వుతోంది. అభిషేక్ పిక్చర్స్, ఆర్‌టి టీమ్‌వర్క్స్‌పై అభిషేక్ నామా ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా నిర్మిస్తున్నారు. అను ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, దక్షా నాగర్కర్, పూజిత పొన్నాడ మొత్తం ఐదుగురు కథానాయికలు నటిస్తున్న ఈ సినిమాలో రవితేజ లాయర్‌గా నటిస్తున్నాడు. రచయితగా కొన్ని ప‌వ‌ర్‌ఫుల్ చిత్రాల‌కు ప‌నిచేసిన‌ శ్రీకాంత్ విస్సా ఈ సినిమా కోసం కొత్త తరహా కథను రాశారు. ప్రముఖ నటులు, సాంకేతిక సిబ్బంది ఈ చిత్రానికి ప‌నిచేస్తున్నారు.

జాతీయ వార్తల కోసం: https://www.vaartha.com/news/national/